Thursday, April 25, 2024
- Advertisement -

కెప్టె గా రోహిత్ వద్దు…కోహ్లీనే ముద్దు…పాక్ మాజీ క్రికెటర్ అక్తర్

- Advertisement -

విండీస్ పర్యటనకు ఈరోజు టీండియా అమెరికా వెల్లనుంది. రెండు టీ20 మ్యాచ్ లు అమెరికాలో ఆడనుంది. ఇదలా ఉంటే ప్రపంచకప్ వైఫల్యం తరువాత టీమిండియా కెప్టెన్ ను మార్చాలనె డిమాండ్ లు వచ్చిన సంగతి తెలిసిందే. రోహిత్ ను వన్డే, టీ20లకు కెప్టెన్ గా, కోహ్లీని టెస్ట్ లకు కెప్టెన్ గా నియమిస్తే బాగేండేపు అభిప్రాయాలను మాజీ క్రికెటర్లు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ కనీసం ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు.

ఇటీవల వెస్టిండీస్ పర్యటనకి జట్లను ప్రకటించిన సెలక్టర్లు మళ్లీ కోహ్లీకే అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. దీంతో కెప్టెన్సీ మార్పు తాత్కాలికంగా సద్దు మనిగింది. అయితే.. తాజాగా షోయబ్ అక్తర్ ఓ అభిమాని ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చి మళ్లీ చర్చ జరిగేలా చేశాడు. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేయగలడా..?’ అని అక్తర్‌ని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అవసరం లేదు అని అతను సమాధానమిచ్చాడు. అంతేకాకుండా.. కోహ్లీ, రోహిత్‌లలో ఎవరు బెస్ట్ అంటే.. కోహ్లీకే ఈ పాక్ పేసర్ ఓటేశాడు. విండీస్ తో భారత్ ఆగస్టు 3 నుంచి భారత్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -