రాహుల్ ద్రవిడ్ కుమారుడు మరోసారి డబుల్ సెంచరీ

1295
former indian captain rahul dravid's son samit dravid slams 2nd double century
former indian captain rahul dravid's son samit dravid slams 2nd double century

మరోసారి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ డబుల్ సెంచరీ చేశాడు. జూనియర్ క్రికెట్‌లో గత ఏడాది డబుల్ సెంచరీ చెలరీగిన సుమిత్.. తాజాగా అండర్-14 బీటీఆర్ షీల్డ్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో కూడా సత్తా చూపించాడు.

రెండు వికెట్లు తీసి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్ 33 ఫోర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. దీంతో.. మాల్యా టీమ్ 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగలిగింది. అనంతరం ఛేదనలో తడబడిన శ్రీ కుమారన్ టీమ్.. 110 పరుగులకే ఆలౌటైంది.

దీంతో.. ఏకంగా 267 పరుగుల తేడాతో మాల్యా టీమ్ విజయాన్ని అందుకుంది. గత ఏడాది. అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ టీమ్ తరఫున ఆడిన సమిత్ ద్రవిడ్.. 256 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 201 పరుగులు చేశాడు.

Loading...