Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు తీసుకోలేదో తెలుసా ?

- Advertisement -

భారత్ 2008 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ వేలానికి నెల ముందు జరిగిన ఈ టోర్నీలో యువ భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన కోహ్లీ.. అందరి దృష్టిని ఆకర్షించాడు. తన సారథ్య ప్రతిభతో పాటు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ ఘన విజయం తర్వాత ప్రారంభ ఐపీఎల్ సీజన్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు ఆడటం ఖాయమని అందరూ భావించారు.

తన సొంత నగరానికి చెందిన ఢిల్లీ డేర్ డెవిల్స్‌కే ఆడుతాడుకున్నారు. కానీ ఢిల్లీ ఫ్రాంచైజీ కోహ్లీని కాదని బౌలర్ ప్రదీప్ సంగ్వాన్ తీసుకొని అందరికి షాక్ ఇచ్చింది. కానీ ఈ అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం వదులుకోలేదు. ఇక ఆర్సీబీ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విరాట్.. అంచెలంచెలుగా ఎదుగుతూ జట్టు కెప్టెన్సీతో పాటు భారత జట్టును నడిపించే స్థాయికి ఎదిగాడు. కానీ సొంత నగరానికి చెందిన కోహ్లీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎందుకు వదులుకుందో ఎవరికి అంతుపట్టలేదు.

అయితే ఐపీఎల్ మాజీ సీఓఓ సుందర్ రామన్ కోహ్లీని ఢిల్లీ కొనుగోలు చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ ‘22 యార్న్స్’షోలో మాట్లాడుతూ.. ఢిల్లీకి మరో బ్యాట్స్‌మన్ తీసుకునే ఉద్దేశం లేకనే కోహ్లీని వదులుకున్నారు. అందుకే కోహ్లీని కాదని బౌలర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకుందని తెలిపాడు. వాస్తవానికి సెహ్వాగ్, డివిలియర్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఢిల్లీ జట్టులో ఉన్నారు. అందుకే కోహ్లీపై ఆసక్తి చూపలేదు. కానీ ఆర్సీబీ ఆ అవకాశాన్ని వదులుకోలేదు అని సుందర్ రామన్ చెప్పుకొచ్చాడు.

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

ధోనీ క్రికెట్‌లో ఓ పెద్ద సూపర్ స్టార్ : డ్వేన్ బ్రావో

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

కోహ్లీ యువ ఆటగళ్ళకి రోల్‌ మోడల్‌.. : శ్రేయాస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -