Thursday, March 28, 2024
- Advertisement -

భారత క్రికెటర్లు స్వార్దపూరితంగా ఆడుతారు : ఇంజిమామ్

- Advertisement -

భారత క్రికెటర్లు స్వార్దపూరితంగా క్రికెట్ ఆడతారని పాకిస్థాన్ మాజీ కెఫ్టెన్ ఇంజిమామ్ ఉల్ హాక్ ఆరోపించాడు. కరోనా వల్ల పాకిస్థాన్ లో లాక్ డౌన్ విధించారు. దాంతో ఇంట్లోనే ఉంటున్న ఇంజిమామ్ ఉల్ హక్.. ఒకప్పటి తన సహచర క్రికెటర్ రమీజ్ రాజాతో కలిసి వీడియో ఛాట్‌లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్లు టీమ్‌ కోసం మాత్రమే ఆడతారని కితాబిచ్చిన ఇంజిమామ్.. భారత క్రికెటర్లు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆరాపడతారని విమర్శలు చేశాడు.

“పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లు తక్కువ పరుగులు చేసిన అవి తమ టీమ్ కోసమే చేస్తారు. కానీ భారత బ్యాట్స్‌మెన్‌ లు సెంచరీ చేసినా సరే.. స్వార్దపూరితంగా అతని కోసమే ఆడతాడు తప్ప టీమ్‌ కోసం కాదు. భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య తేడా ఇదే” అని ఇంజిమామ్ ఉల్ హక్ అన్నారు.

ఇక బౌలింగ్ లో బానే రాణిస్తున్న పాకిస్థాన్.. బ్యాటింగ్ లో తేలిపోతుంది. ఇక రికార్డుల పరంగా చూస్తే.. పాక్ కంటే భారత బ్యాట్స్‌మెన్‌లే ఒక అడుగు ముందుంటారు. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ శతకాలతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లీ ఇప్పటికే 70 శతకాలతో దిగ్గజ క్రికెటర్ హోదాని అందుకున్నాడు. కానీ.. పాకిస్థాన్ నుంచి ఈ స్థాయిలో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -