Friday, April 26, 2024
- Advertisement -

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ని అమ్మేశాం : శ్రీలంక మాజీ క్రీడామంత్రి

- Advertisement -

భారత్, శ్రీలంక మధ్య జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి గురైనట్లు.. శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి మహీందానంద అలుత్‌గమాగే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ రోజు మ్యాచ్ లో మొదట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక. మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13×4) శతకం బాదడంతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్.. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9×4), మహేంద్రసింగ్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడటంతో 48.2 ఓవర్లలోనే 277/4తో ఛేదించింది. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ 2011లో వరల్డ్‌కప్ గెలిచిన విషయం మనందరికి తెలిసిందే.

ఆ మ్యాచ్ టాస్ వద్ద కెఫ్టేన్లు ధోనీ, సంగక్కర మధ్య కన్‍ఫ్యూజన్ కారణంగా రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఆ దేశ మాజీ క్రీడల్ మంత్రి స్వయంగా ఆరోపణలు చేయడంతో ఫైనల్ మ్యాచ్ పై సందేహాలు మొదలయ్యాయి.

ఆ ఫైనల్ మ్యాచ్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహీందానంద అలుత్‌గమాగే మాట్లాడుతూ ‘‘ 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో శ్రీలంక అమ్ముడుపోయింది. నేను అప్పట్లో క్రీడ మంత్రిని.. అయినప్పటికి నమ్మక తప్పడం లేదు. 2011లో వన్డే వరల్డ్ కప్ ని శ్రీలంక గెలిచి ఉండేది. కానీ.. ఆ మ్యాచ్‌ని మేము అమ్మేశాం. నేను ఏ ఆటగాడితోనూ ప్రస్తుతం కాంటాక్ట్‌లో లేను. కానీ.. టీమ్‌లోని కొంతమంది ఫిక్సింగ్‌కి సహకరించారు’’ అని సంచలన ఆరోపణలు చేశాడు.

సచిన్ గాయం తెలిసే బౌన్సర్లు వేశాను : షోయబ్ అక్తర్

ఐపీఎల్ లో రోహిత్ కెఫ్టెన్ గా సక్సెస్ కు కారణం చెప్పిన లక్ష్మణ్

ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పి చెన్నైకి షాక్ ఇచ్చిన శ్రీశాంత్

తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి ఎప్పుడు అయింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -