Saturday, April 20, 2024
- Advertisement -

లీడర్ అంటే ధోనీనే.. అందుకు అసలైన సాక్ష్యం ఇదే : మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్

- Advertisement -

టీమిండియా మాజీ కెఫ్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ నిజమైన లీడరని మాజీ కోచ్ గ్యారీ కిర్‍స్టన్ అన్నారు. 2008లో టీమిండియా చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గ్యారీ కిర్ స్టన్.. అప్పటి కెఫ్టెన్ ధోనీతో మంచి తనకు మంచి సాన్నిహిత్యం ఉందని ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పాడు. టీంని లీడర్ గా నడిపించడంలో ధోనీకి తిరుగులేదని కొనియాడిన గ్యారీ.. మైదానం వెలుపల కూడా అతను నిజమైన నాయకుడిగా వ్యవహరించేవాడని ఉదాహరణతో వివరించాడు.

“ధోనీ గొప్ప లీడర్. నన్ను ఆకర్శించిన వ్యక్తుల్లో ధోనీ ఒకడు. ధోనీ ఒక్కసారి ఎవరినైన నమ్మాడంటే.. వారికోసం చివరి వరకు నిలబడుతాడు. 2011 వన్డే ప్రపంచకప్ ముందు.. బెంగళూరులోని ప్లైట్ స్కూల్‌ నుంచి టీమిండియాకి ఒక ఆహ్వానం అందింది. దాంతో టీమిండియా క్రికెటర్లతో పాటు నేను, టీమ్ సపోర్ట్ స్టాఫ్ గా ఉన్న ప్యాడీ ఆప్టన్, ఎరిక్ సిమన్స్ వెళ్ళాం. అయితే.. మేము ముగ్గురం దక్షిణాఫ్రికాకి చెందిన వాళ్లం కావడంతో.. భద్రతా కారణాలు చూపుతూ మమ్మల్ని స్కూల్‌ లోపలికి అనుమతించలేదు.

దాంతో.. కెప్టెన్ ధోనీ ‘వాళ్లు.. మా వాళ్లు.. స్కూల్‌లోకి వాళ్లని అనుమతించకపోతే.. మేము కూడా రాం’ అనేసి ఆ ఈవెంట్‌ని క్యాన్సిల్ చేసేశాడు. నాయకుడిగా తన చుట్టూ ఉన్నవారిపై ధోనీ ఉంచిన నమ్మకం అది’’ అని గ్యారీ కిర్‌స్టన్ చెప్పుకొచ్చాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలుపొందగా.. ఆ టోర్నీ ఫైనల్లో యువరాజ్ సింగ్ కు బదులుగా బ్యాటింగ్ ఆర్డర్ లో ధోనీ ముందుకు వెళ్తానంటే గ్యారీ కిర్ స్టన్ అడ్డు చెప్పలేదు. ఫైనల్లో టీమిండియా గెలుపు కి ఆ బ్యాటింగ్ ఆర్డర్ మార్పే ముఖ్య కారణం అని చాలా మంది మాజీ క్రికెటర్లు అప్పట్లో అభిప్రాయపడ్డారు. ధోనీపై కోచ్‌గా గ్యారీ ఉంచిన నమ్మకం ఆది.

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

ఆల్‌టైమ్ బెస్ట్ ఫీల్డర్ జడేజా.. చివర్లో కోహ్లీ..!

రిటైర్మెంట్‌ మ్యాచ్‌లో ధోనీ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు : గంగూలీ

ధోనీకి ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -