కోహ్లీ కంటే సచిన్ గొప్ప ఆటగాడు : గంభీర్

372
gambhir opines sachin better than kohli in white ball game
gambhir opines sachin better than kohli in white ball game

ఈ మధ్య కాలంలో క్రికెట్ లో ఇతర బ్యాట్స్ మెన్స్ తో మరొక బ్యాట్స్ మెన్ ను పోల్చడం మాములు అయిపోయింది. కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది. కోహ్లీ సాధించిన రికార్డుల కారణంగా అతనితో ఇతర బ్యాట్స్ మెన్స్ ను పోలీస్తున్నారు. అయితే ఇప్పటికే కోహ్లీ గొప్ప ఆటగాడని చాలా మంది అతని గురించి చెప్పారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం కోహ్లీ కంటే సచిన్ టెండూల్కరే గొప్ప ఆటగాడని అంటున్నాడు.

వన్డేల్లో కోహ్లీతో పోల్చితే సచినే మిన్నగా భావించాలని పేర్కొన్నాడు. సచిన్ ఆడిన రోజుల్లో పవర్ ప్లే నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని.. మ్యాచ్ లో ఒక బంతి మాత్రమే ఉండేదని, పవర్ ప్లేలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఇన్ సైడ్ సర్కిల్ లో ఉండేవారని గంభీర్ తెలిపాడు. ఇప్పుడు అలా లేదని.. రెండు తెల్ల బంతులు ఇస్తున్నారని.. దాంతో బంతి పాత బడటం తగ్గి రివర్స్ స్వింగ్ సాధ్యం కావడం లేదని వెల్లడించాడు.

అంతేకాకుండా మూడు పవర్ ప్లేలు ఉంటున్నాయని.. 1 నుంచి 10వ ఓవర్ వరకు 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉంటుందని, రెండో పవర్ ప్లేలో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని, చివరి పవర్ ప్లేలో ఐదుగురికి మాత్రమే సర్కిల్ బయట ఫీల్డింగ్ చేసే వెసులుబాటు ఉంటుందని గంభీర్ వివరించాడు. ఇలాంటి పరిస్థితిలు ఉన్నప్పుడు ఓ ఆటగాడు సులభంగా పరుగులు చేస్తాడని.. అందుకే గత నిబంధనలతో ఆడిన సచినే ఎంతో గొప్ప అని భావిస్తానని తెలిపాడు. అయితే కోహ్లీ చేసిన పరుగులు కూడా అద్భుతమని గంభీర్ పేర్కొన్నాడు.

Loading...