Thursday, April 25, 2024
- Advertisement -

ఆ విషయంలో రోహిత్ కంటే కోహ్లీనే బేటర్ : గంభీర్

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్ మెన్ ? అనే ఈ ప్రశ్నకు గత ఏడాదిగా ఎక్కువ ఓట్లు రోహిత్ కే వచ్చాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు బాదిన రోహిత్ ఒంటిచేత్తో టీమ్ ని సెమీ ఫైనల్స్ కి తీసుకొచ్చాడు. వన్డేల్లో ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు రోహిత్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తన దృష్టిలో కోహ్లీనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. “స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ ప్రతి బంతికీ స్ట్రైక్ రొటేట్ చేయగలడు. కానీ రోహిత్ అలా చేయలేడు. రోహిత్ భారీ షాట్లు ఆడుతాడు. కానీ మ్యాచ్‌ల్లో హిట్టింగ్ కంటే స్ట్రైక్ రొటేట్ చేయగలిగిన బ్యాట్స్‌మెనే నిలకడగా రాణించగలడు. రోహిత్ శర్మకే కాదు.. క్రిస్‌గేల్, ఏబీ డివిలియర్స్‌కి స్పిన్‌లో స్ట్రైక్ రొటేటే చేసే సామర్థ్యం లేదు’’ అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.

భారత్ తరఫున దాదాపు 13 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ గంభీర్.. హిట్టింగ్ తో ఈజీగా స్ట్రైయిక్ ని రొటేట్ చేయగలడు. ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌లో బ్యాక్‌ఫుట్ వెళ్లి మరీ బంతిని ఫీల్డర్ల మధ్యలోకి నెట్టడం గంభీర్ స్టయిల్. ఇక కోహ్లీ కూడా ఫీల్డర్ల మధ్యలోకి బంతిని నెట్టి సింగిల్స్ రాబట్టడంలో సిద్ధహస్తుడు. వికెట్లు చేజారుతున్న టైంలో ఫీల్డర్లపై ఒత్తిడి పెంచాలంటే స్ట్రైయిక్ రొటేషన్ చాలా ముఖ్యం.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏం సాధించాడు ?: గంభీర్

సుశాంత్ మృతిపై ధోనీ స్పందించకపోవడానికి కారణం ఏంటి ?

టీ20ల్లో రోహిత్ శర్మ పక్కా డబుల్ సెంచరీ చేస్తాడు : కైఫ్

ధోనీ క్రికెట్‌లో ఓ పెద్ద సూపర్ స్టార్ : డ్వేన్ బ్రావో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -