ధోనీ విన్నింగ్ సిక్సర్.. ఫైర్ అయిన గౌతమ్ గంభీర్..!

923
gautam gambhir irked by obsession with ms dhoni six
gautam gambhir irked by obsession with ms dhoni six

గురువారంతో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్‌ కైవసం చేసుకొని తొమ్మిదేళ్లు కంప్లీట్ అయ్యాయి. 2011 ఏప్రిల్ 2వ తేదీన మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని టీమిండియా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ప్రపంచకప్‌ నెగ్గింది. నాడు వాంఖండే స్టేడియాంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. ఈ మధుర జ్ఞాపకాన్ని క్రికెటర్లు, ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ‘క్రిక్‌ ఇన్ఫో’ వెబ్‌సైట్‌ కూడా ఈ విషయంను గుర్తు చేసింది.

తమ ట్విట్టర్ లో ధోనీ విన్నింగ్ సిక్సర్ ఫోటోను పోస్ట్ చేసింది. దానికి ‘2011లో ఇదే రోజు.. ఈ షాట్‌ కోట్లాది మంది ఇండియన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు కోపం తెప్పించింది. 2011 వరల్డ్‌ కప్ ఫైనల్లో టీమిండియా తరుపున గంభీర్ టాప్ స్కోరర్. అయితే ప్రతి ఒక్కరి కృషి కారణంగానే జట్టు విజయం సాధించని గంభీర్ అన్నాడు. ’ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు నేను ఓ విషయం గుర్తు చేస్తున్నా. 2011 వరల్డ్‌కప్‌ను యావత్ దేశం గెలిచింది. మొత్తం జట్టు, సహాయ సిబ్బంది వల్లే ఇది సాధ్యమైంది.

మీరు ఇప్పటికైనా ఆ సిక్సర్ పై వ్యామోహాన్ని వదులుకుంటే మంచిది’ అని ట్వీట్ చేశాడు. ఆ రోజు ఫైనల్లో 31 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోలిపోతే కష్టాల్లో పడ్డ జట్టును గంభీర్ అదుకున్నాడు. అయితే 97 రన్స్ వద్ద గంభీర్ ఔటవగా.. చివరిదాకా క్రీజులో ఉన్న ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. జట్టు విజయంలో గంభీర్ పాత్ర చాలా ఉన్నప్పటికీ, ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ మాత్రమే ఆ ఫైనల్ ల్లో హైలైట్ అయింది.

Loading...