Friday, April 26, 2024
- Advertisement -

ధోని రిటైర్మెంట్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన భాజాపా ఎంపీ ,మాజీ క్రికెట‌ర్ గంభీర్‌

- Advertisement -

ప్ర‌స్తుతం ధోని రిటైర్మెంట్‌పైనే పెద్ద చ‌ర్చ జ‌ర‌గుతోంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోని పేవ‌ల బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శించ‌డంతో విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చాలా మంది సీనియ‌ర్‌లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని సూచిస్తున్నారు. త్వ‌ర‌లో విండీస్ టూర్‌కు ధోనిని ఎంపిక చేస్తారా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇలా ఉంటె మాజీ క్రికెట‌ర్ , భాజాపా ఎంపీ గౌతం గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ధోనీ కెప్టెన్ గా వ్యవహరించిన సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్ లో సెహ్వాగ్, సచిన్ లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించాడు. యువ ఆటగాళ్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. ప్ర‌స్తుతం ధోనీ తన కెరీర్ చరమాంకంలో ఉన్నాడని, ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా తన కెరీర్ పై ధోనీ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.

తదుపరి ప్రపంచకప్ కోసం అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ను సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని గంభీర్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు వికెట్ కీపర్‌గా రిషభ్‌ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లు ఉన్నార‌న్నారు. ధోని స్థానంలో ఒక్కొక్క‌రికి ఏడాదిన్న‌ర్ర‌పాటు ముగ్గురిని ప‌రీక్షించి వారిలో ఎవ‌రు బాగా ఆడితే వారిని త‌దుప‌రి ప్ర‌పంచ‌క‌ప్‌లో తీసుకోవాల‌ని సూచించారు. మహేంద్రసింగ్‌ ధోని అత్యత్తమ కెప్టెన్‌ అన్న గంభీర్‌.. గెలిస్తే క్రెడిట్‌ అంతా అతనికివ్వడం ఓడితే నిందించడం సరికాదన్నారు. ‘గణంకాలు చూస్తే ధోని అత్యుత్తమ కెప్టెన్ అని కొనియాడారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -