Friday, April 19, 2024
- Advertisement -

డివిలియర్స్‌లోని సామర్థ్యం.. గేల్‌కు ఉన్న బలం.. కోహ్లీకి లేదు : గంభీర్

- Advertisement -

భారత్ కెఫ్టెన్ విరాట్ కోహ్లీపై గంభీర్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాట్స్ మెన్ గా కోహ్లీ సక్సెస్ కావొచ్చు.. కానీ కెఫ్టెన్ గా మాత్రం విఫలయ్యాడని.. కెఫ్టెన్ గా అతను సాధించింది ఏం లేదని కోహ్లీని తక్కువ చేస్తూనే ప్రశంసించాడు గంభీర్.

విరాట్ తెలివైన ఆటగాడు అని మెచ్చుకుంటూనే.. వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌కు ఉన్న బలం.. సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్‌కు ఉన్న సామర్థ్యం లేదన్నాడు. కేవలం ఫిట్ నెస్ తోనే క్రికెట్ లో రాణిస్తున్నాడని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న గంభీర్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కోహ్లీ అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా ఎదగడానికి కారణం ఏందని ప్రశ్నించగా ఈ విధంగా సమాధానమిచ్చాడు.

“విరాట్ మంచి తెలివైన ఆటగాడు. చాలా ఫిట్‌గా ఉండటంతోనే టీ20 క్రికెట్‌లో సక్సెస్ అవుతున్నాడు. ఎందుకంటే అతనికి క్రిస్ గేల్ కండ బలం లేదు.. డివిలియర్స్‌, జాక్వస్ కల్లిస్‌, బియన్ లారాలా సామర్థ్యం లేదు. కానీ అతని అతిపెద్ద బలం ఫిట్‌నెస్. ఆ బలంతోనే సక్సెస్ అవుతున్నాడు. ఈ విషయంలో మనమంతా అతనికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రధానంగా వికెట్ల మధ్య విరాట్ అద్భుతంగా పరుగెత్తుతాడు. చాలా మంది రన్స్ తీయరు. అదే అతని సక్సెస్ సీక్రెట్’అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ధోనీ నాకు వార్నింగ్ ఇచ్చాడు : సురేశ్ రైనా

సచిన్ గాయం తెలిసే బౌన్సర్లు వేశాను : షోయబ్ అక్తర్

ఐపీఎల్ లో రోహిత్ కెఫ్టెన్ గా సక్సెస్ కు కారణం చెప్పిన లక్ష్మణ్

ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పి చెన్నైకి షాక్ ఇచ్చిన శ్రీశాంత్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -