కోహ్లీ,రోహిత్ మధ్య విబేధాలపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసిన గవాస్కర్..

414
Gavaskar made sensational comments once again on the differences between Kohli and Rohit
Gavaskar made sensational comments once again on the differences between Kohli and Rohit

ఇటీవల వరల్డ్ కప్ ముగియగానే భారత క్రికెట్ వర్గాల్లో ఓ అంశం విపరీతంగా చర్చకు వచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయంటూ సామాజకి మాధ్యమాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

తమ మధ్య విబేధాలు లేవని కోహ్లీ క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఇలాంటి వివాదాల మధ్య విండీస్ టూర్ కు వెల్లింది. వీరి మధ్య విబేధాలపై మరోసారి సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 20 ఏళ్లు గడిచినా కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కథనాలు వస్తూనే ఉంటాయని, వాటికి అడ్డుకట్ట వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.

రోహిత్ పొరబాటున తక్కువ స్కోరుకే అవుటయ్యాడంటే, రోహిత్ కావాలనే అవుటయ్యాడంటూ కోహ్లీకి చాడీలు చెప్పేవాళ్లు తయారవుతుంటారని అన్నారు. అలాంటి కథనాలు సృష్టించేవారు భారత క్రికెట్‌ శ్రేయోభిలాషులు కారు. వీటి వల్ల ఆ ఆటగాళ్లు చికాకు పడతారు. ఇవి జట్టుకు హాని చేస్తాయి. క్రికెటర్ల మధ్య అనుబంధం దెబ్బతింటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియాకు కూడా చురకలు అంటించారు. ఇక మీడియాకు ఇదంతా అమృతం లాంటింది. క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఇలాంటి కథనాలు వాటంతట అవే తగ్గిపోతాయి. మ్యాచుల మధ్య విరామం దొరగ్గానే మళ్లీ మొదలవుతాయంటూ వ్యాఖ్యలు చేశారు. విరాట్, కోహ్లీ లు ప్రొఫెషనల్స్‌ అని వారు భారత్ గెలుపుకోసమే ఆడుతారంటూ గావస్కర్‌ తెలిపారు.

Loading...