Wednesday, April 24, 2024
- Advertisement -

యూనివర్షల్ బాస్ గేల్ కు వినూత్నంగా బర్త్‌డే విషెస్ చెప్పిన టీమిండియా క్రికెటర్లు…

- Advertisement -

ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటానని ప్రకటించిన క్రిస్ గేల్ ఆతర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఈ కరేబియన్ విధ్వంసరకర బ్యాట్స్ తన 40 పుట్టిన రోజుని జరుపుకున్నారు.ఈ సందర్భంగా గేల్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గేల్‌కు సహచర ఆటగాడైన కేఎల్‌ రాహుల్‌ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.

క్రిస్ గేల్ పుట్టినరోజు సందర్భంగా కేఎల్ రాహుల్ “సిగ్గు పడకు బాస్‌.. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి” అంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఇక గేల్‌కు చహల్‌ అభినందనలు తెలియజేస్తూ ‘ హ్యాపీ బర్త్‌ డే అంకుల్‌’ అని పేర్కొన్నాడు. ‘ క్రికెట్‌ లెజెండ్‌.. ఎంటర్‌టైనర్‌కు ఇవే నా శుభాకాంక్షలు’ అని కృనాల్‌ ట్వీట్‌ చేయగా, ‘ హ్యాపీ బర్త్‌డే యూనివర్స్‌ బాస్‌’ అని శ్రేయస్‌ అయ్యర్‌ అభినందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -