Saturday, April 20, 2024
- Advertisement -

ప్రతీసారి టేలర్ నాలుక ఎందుకు బయటకు పెడుతాడో తెలుసా ?

- Advertisement -

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాస్ టేలర్ (109 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగిపోయాడు. కోహ్లీసేన జోరుకు బ్రేక్ వేశాడు, మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సెంచరీ తర్వాత నాలుక బయటపెడ్తూ టేలర్ ఓ పోజ్ ఇచ్చాడు. అసలు టేలర్ ఎందుకు అలా నాలుక బయటకు పెడుతాడు అని చాలా మందికి డౌటే.

సెంచరీ చేసిన ప్రతీసారి టేలర్ ఇలానే నాలుక బయటపెడ్తాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పేదాక ఎవరూ గుర్తించలేదు. అంతేకాకుండా అలా ప్రతీసారి నాలుక ఎందుకు బయపెడ్తావో చెప్పవా? అంటూ కూడా భజ్జీ ట్విటర్ వేదికగా టేలర్‌ను ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ క్రికెట్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడావ్ టేలర్‌. అత్యద్భుతం. కానీ సెంచరీ చేసిన ప్రతీసారి నాలుక ఎందుకు బయట పెడ్తావో చెప్పవా? అంటూ ఫన్నీ ఎమోజీతో క్రికెట్‌లో మంచి గేమ్’అంటూ ట్వీట్ చేశాడు.

ఇక 2015లో cricket.com.au ప్రచురించిన ఓ కథనంలో కూతురు సంతోషం కోసమే సెంచరీ చేసినప్పుడల్లా నాలుకను బయటపెడ్తానని రాస్ టేలర్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో సెంచరీ చేసిన తర్వాత నాలుకను బయటపెట్టినప్పుడు తన కూతురు చాలా సంతోషించిందని, దాంతో రాస్ టేలర్ దాన్ని అలానే కొనసాగిస్తున్నాడని ఆ కథనం పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -