Friday, March 29, 2024
- Advertisement -

కోహ్లీ తప్పు చేశాడు..హర్భజన్ సింగ్ ఫైర్..!

- Advertisement -

ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా మంగళవారం జరిగిన మొదటి వన్డేల్లో భారత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్పు పై విమర్శలు వస్తున్నాయి. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ని ఆడించడం కోసం.. నెం.4లోకి మారిన విరాట్ కోహ్లీ 14 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.

కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్లే టీమిండియా ఓటమికి ముఖ్య కారణమని ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ మంజ్రేకర్.. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించగా.. తాజాగా ఈ జాబితాలో హర్భజన్ సింగ్ కూడా చేరారు. వన్డేల్లో నెం.3లో బ్యాటింగ్ చేసి ఎన్నో మ్యాచ్ ల్ని విరాట్ కోహ్లీ గెలిపించాడు. అయితే వాంఖడే వన్డేలో కోహ్లీ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు అని హర్భజన్ సింగ్ అన్నారు.

3వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రాహుల్ 47 పరుగులు చేసి ఔటవగా.. నెం.5లో ఆడిన శ్రేయాస్ అయ్యర్ 4 పరుగుల వద్దే ఔట్ అయ్యాడు. రాహుల్‌ కోసం చేసిన మార్పులు కారణంగా నెం.4లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న శ్రేయాస్ కూడా నెం.5లో ఆడి ఫెయిలవడం టీమిండియాని దెబ్బతీసింది. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకి ఆలౌటవగా.. ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండానే 37.4 ఓవర్లలోనే ఛేదించేసింది. కోహ్లీకి వన్డేల్లో ఇలా 10 వికెట్ల తేడాతో పరాజయం ఎదురవడం ఇదే ఫస్ట్ టైమ్‌కాగా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఇలా వన్డేల్లో ఓడటం కూడా ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -