Friday, April 19, 2024
- Advertisement -

టీ20లో చెలరేగిన హార్దిక్ పాండ్య.. ఏకంగా 20 సిక్సర్లు..!

- Advertisement -

ఇటీవలే ముంబయి వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో ఇటీవల 39 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక ఈ రోజు 55 బంతుల్లోనే 6×4, 20×6 సాయంతో ఏకంగా 155 పరుగులతో చేసి నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్‌లో పాండ్యా స్ట్రైక్‌రేట్‌ 287.27గా ఉండగా.. అతను ప్రాతినిథ్యం వహించిన రిలయన్స్ 1 టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.

ఈరోజు భారత్ ప్రెటోలియం కంపెనీ లిమిటెడ్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రిలయన్స్ 1 టీమ్.. ఆరంభంలోనే 10/2తో కష్టాల్లో పడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (3), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (4) నిరాశపరిచారు. ఈ దశలో క్రీజులోకి వెళ్లిన హార్దిక్ పాండ్యా.. సిక్సర్ల మోత మోగించేశాడు. సౌరభ్ తివారి (41)తో కలిసి మూడో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హార్దిక్.. ఆకాశమే హద్దుగా ఆఖరి వరకూ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే ఈ ఆల్‌రౌండర్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం విశేషం.

వెన్నుగాయంతో గత ఏడాది టీమిండియాకు దూరమైన పాండ్య.. రెండు నెలల నుంచి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ.. భారత సెలక్టర్లు మాత్రం అతనికి అవకాశం ఇవ్వడం లేదు. మ్యాచ్‌కి కావాల్సిన ఫిట్‌నెస్ అతను ఇంకా సాధించలేదని చెప్తూ ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనకి కూడా దూరం పెట్టారు. దీంతో.. నాలుగు రోజుల వ్యవధిలోనే వరుసగా 105, 158 (నాటౌట్) పరుగులు చేసిన హార్దిక్.. ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌నీ నిరూపించుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌కి హార్దిక్ ఎంపికవడం ఖాయం అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -