Thursday, April 25, 2024
- Advertisement -

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యాకు అదిరిపోయే రికార్డ్..!

- Advertisement -

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇతడు గత ఏడాది గాయం కారణంగా టీమిండియాకి దురం అయ్యాడు. ఈ ఏడాది ముంబయిలో జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో వరుసగా సెంచరీలు చేసి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హార్దిక్.. మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌కి ఎంపికయ్యాడు.

కానీ కరోనా కారణంగా ఆ సిరీస్ ఆగిపోయింది. ఇక ఈ అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఐపీఎల్ 2020 రాణిస్తే వరల్డ్‌కప్‌ కి ఎంపిక అవ్వొచ్చని హార్దిక్ ఆశించాడు. కానీ కరోనా కారణంఘా ఐపీఎల్ 2020 వాయిదా పడింది. జరుగుతుందో లేదో కూడా అనుమానమే. అయితే ఐపీఎల్‌లోనే హార్దిక్ పాండ్యాకి తిరుగులేని రికార్డ్‌లున్నాయి. ధోనీ తరహాలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చే ఈ పవర్ హిట్టర్.. అమాంతం టీమ్ స్కోరుని పెంచడంలో సిద్ధహస్తుడు.

2019 ఐపీఎల్ లో హార్దిక్ మంచి రికార్డ్ ఉంది. ముంబయి ఇండియన్స్ తరఫున గత ఏడాది 16 మ్యాచ్‌లాడిన హార్దిక్ 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 14 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముంబయి టీమ్ ఐపీఎల్ 2019 సీజన్ టైటిల్ గెలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఓ సీజన్‌లో 400పైచిలుకు పరుగులు 10కిపైగా వికెట్లు తియడం మొదటిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -