Wednesday, April 24, 2024
- Advertisement -

కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ తో పీకల్లోతు ప్రేమలో హార్ధిక్ పాండ్యా…

- Advertisement -

ప్రేమాయణాలు, డేటింగ్ లు నడపడంలో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌పాండ్యాకు కొత్తేమి కాదుతాజాగా మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య జరిగిన ఓ వేడుకలో ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో అతడు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఊర్వశి రౌతెలా, ఎల్లీ అవ్రమ్‌, ఇషా గుప్తాతో ఎపైర్లు నడిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హార్దిక్‌ ‘నాచ్‌ బేలియె 9’ అనే డ్యాన్స్‌ షోలో పోటీదారు నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హార్దిక్‌ ‘నాచ్‌ బేలియె 9’ అనే డ్యాన్స్‌ షోలో పోటీదారు నటాషా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది.

బాద్షా హిట్‌సాంగ్‌ ‘డీజేవాలె బాబు’తో నటాషా అందరికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో గెస్టు డ్యాన్సర్‌గా ఆకట్టుకుంది.తాజాగా ముంబైలోనికి బాంద్రాలో జరిగిన ఓ వేడుకకు నటాషాతో కలిసి హార్దిక్‌ పాండ్యా హాజరయ్యాడట. ఇదే సమయంలో నటాషాను కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడంట.

ప్రపంచకప్‌కు ముందు కరణ్ జోహార్ నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్దిక్‌ పాండ్యా పాల్గొని మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొన్నాళ్లు అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అయితే బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో బీసీసీఐ వదిలేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -