భారత పేసర్ల విజయ రహస్యం ఇదే : బౌలింగ్ కోచ్

660
honesty communication hard work key to indian pacers success bharat arun
honesty communication hard work key to indian pacers success bharat arun

కమ్యూనికేషన్, హార్డ్ వర్క్, నిజాయితి భారత జట్టు ఫేసర్ల విజయానికి కారణమని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ చెప్పారు. కోచింగ్ సిబ్బందితో కూడా బహిరగ సంభాషణ భారత పేసర్ల విజయానికి కారణం అని తెలిపారు. ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత బౌలింగ్ లైనప్‌పై భరత్ అరుణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.

పేసర్లు రాణించాలంటే వారు నిలకడగా ఆడాలి. అతిగా బౌలింగ్ చేయించడం ఒకటి. పనిభారం పర్యవేక్షణ లేదు. సరైన విశ్రాంతి లేదు. తక్కువగా బౌలింగ్‌ చేయించడం మరో కారణం. ఇవన్నీ పేసర్ల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి అని అన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ పేసర్ల మధ్య మంచి సంభాషణ ఉండాలి. బౌలర్ తన ఆలోచనలను, భయాలను, నమ్మకాలను చెప్పినప్పుడే అతనికి సహాయిక సిబ్బంది బాగా చూసుకోగలుగుతారు.

టిమిండియాలో మంచి వాతావరణాన్ని సృష్టించిన కోచ్ రవిశాస్త్రి, కెఫ్టెన్ కోహ్లీకి ఈ సందర్భంగా భరత్ థ్యాంక్స్ చేప్పారు. అయితే నిజాయితీ చాలా ప్రధానమని.. ఆటగాళ్లకు ఇలాంటి స్వేచ్చనిచ్చిన కోహ్లీ, రవిశాస్త్రికి అభినందనలు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడు ఇచ్చిన ప్రేరణతో మిగతా పేసర్లు రాణిస్తున్నారని భరత్ అరుణ్ వెల్లడించారు.

Loading...