Saturday, April 20, 2024
- Advertisement -

ధోనీ స్టయిల్ వేరు.. గొప్ప ఫినిషర్ కూడా : హస్సీ

- Advertisement -

భారత మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచులను ఓ ప్లాన్ ప్రకారం ముగిస్తాడని ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అన్నారు. డెత్ ఓవర్లలో ధోనీ ఎలా బ్యాటింగ్ చేస్తాడో..? ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలో ఆడిన హస్సీ వివరించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. టోర్నీలో ఆడిన ప్రతి సీజన్‌లోనూ ప్లేఆఫ్‌కి చేరిన చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

“క్రికెట్‍లో ఏ ఫార్మట్ అయినా ధోనీ గొప్ప ఫినిషర్. మ్యాచ్ సమయంలో కామ్‌గా వ్యూహాలు రచించే ధోనీ.. ఫస్ట్‌లోనే ప్రత్యర్థి టీమ్ కెప్టెన్‌ని బెదరగొడతాడు. అతనిలో నమ్మశక్యంకాని పవర్ దాగి ఉంది. ఎప్పుడు బంతిని బౌండరీ దాటించాలో..? ధోనీకి బాగా తెలుసు. ఆశించినట్లుగా అతను హిట్టింగ్ చేయగలడు కూడా. అతని ఆత్మవిశ్వాసం అలాంటిది. వ్యక్తిగతంగా ధోనీపై ఉన్న నమ్మకం నాపై నాకు కూడా లేదు. ఒక ఓవర్‌లో 12-13 పరుగులు ఎలా చేయాలో..? ధోనీ నుంచే నేను నేర్చుకున్నాను.

ఆఖరి వరకూ వెయిట్ చేయడం ధోనీ స్టయిల్. ఎందుకంటే..? ఆ సమయంలో ఒత్తిడి తన కంటే బౌలర్లపైనే ఎక్కువగా ఉంటుందని అతనికి బాగా తెలుసు’’ అని మైకేల్ హస్సీ వెల్లడించాడు. ఇక మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కావాలి కానీ.. కరోనా వైరస్ కారణంగ ఏప్రిల్ 15కి వాయిదాపడింది. అయితే ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ని మే 3 వరకూ పొడిగించడంతో ఈ ఏడాది ఐపీఎల్‌ ఉండకపోవచ్చ అన్న అనుమానాలు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -