Saturday, April 20, 2024
- Advertisement -

పోటీ ఎక్కువగా ఉంది.. అందుకే ఆరో స్థానంలో : మనీష్‌ పాండే

- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మనీశ్‌ పాండే (36 బంతుల్లో 50 నాటౌట్‌, 3 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సంజు సాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టైంలో టీమిండియాను పాండే ఆదుకున్నాడు. అజేయ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

మ్యాచ్ తర్వాత పాండే మాట్లాడుతూ.. “చాలా హ్యాపీగా ఉంది. నా ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నాను. నేను ఆరో స్థానంలో వచ్చి విలువైన పరుగులు చేయడం సంతోషంగా ఉంది. జట్టులో ఇప్పుడు నాది ఆరో స్థానమనే ఫిక్స్‌ అయ్యా. ఎందుకంటే.. ముందుగా రావడానికి నాకు చాయిస్‌ లేదు. ప్రస్తుతం ఆ స్థానం కోసమే సన్నద్ధమవుతున్నా. నేను మూడు లేదా నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తా. అయితే ఆ స్థానంలో ఇప్పుడు పోటీ ఉంది. చాన్స్‌ల కోసం నిరీక్షించక తప‍్పదు’ అని పాండే అన్నాడు. 30 ఏళ్ల మనీష్‌ పాండే టీ20ల్లో తన నాటౌట్‌ ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో వరుసుగా ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 46.40 యావరేజ్‌తో మనీష్‌ పాండే మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ల తర్వాత అత్యుత్తమ యావరేజ్‌ పాండేదే కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -