ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి 212కే కుప్ప‌కూలిన వెస్టీండీస్‌ …..

234
ICC Cricket World Cup 2019 ENG vs WI: England beat West Indies by 29 runs
ICC Cricket World Cup 2019 ENG vs WI: England beat West Indies by 29 runs

ప్ర‌పంచ‌క‌ప్ లో భాగంగా ఇవాల సౌతాస్టాలో ఇంగ్లండ్‌, వెస్టీండిస్‌ల మ‌ద్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి 44.4 ఓవర్లలో 212 పరుగులకు చాపచుట్టేసింది వెస్టీండీస్‌. మొద‌ట టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫిల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌లో నికోలస్ పూరన్(63: 78 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), హెట్‌మైర్(39: 48 బంతుల్లో 4ఫోర్లు), క్రిస్‌గేల్(36: 41 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణిండంతో విండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. పూరన్, హెట్‌మైర్ మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ఆతిథ్య జట్టు బౌలర్లు ఆరంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ తో విండీస్ హార్డ్ హిట్టర్లను కట్టడి చేశారు.

ఎంతో ఆశతో బ్యాటింగ్ వచ్చిన విండీస్ జట్టు స్కోరు 4 వద్ద ఎవిన్ లూయిస్(2) వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. విండీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. ఆరు బంతులాడిన విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ కనీసం సింగిల్ కూడా తీయలేదు. జోఫ్రా ఆర్చర్ వేసిన రెండో ఓవర్‌లో కేవలం రెండు పరుగులే వచ్చాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో లూయిస్‌ను వోక్స్ బౌల్డ్ చేసి కరీబియన్‌ను దెబ్బకొట్టాడు.తొలి 5 ఓవర్లకు విండీస్ వికెట్ నష్టానికి కేవలం 8 రన్స్ మాత్రమే చేసిందంటే బౌలింగ్ ఎంత ట‌ఫ్‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

జోఫ్రా ఆర్చర్(3/30), మార్క్‌వుడ్(3/18) తెలివిగా బంతులేశారు. ఆతిథ్య బౌలర్లలో జో రూట్(2/27), క్రిస్‌వోక్స్(1/16), ఫ్లంకెట్(1/30) మెరుగ్గా బౌలింగ్ చేశారు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో లూయిస్(2), కెప్టెన్ హోల్డర్(9) నిరాశపరిచారు.

Loading...