Saturday, April 20, 2024
- Advertisement -

జాక్ పాట్ కొట్టిన‌ రిష‌బ్‌…ఇంగ్లండుకు ప‌య‌నం…

- Advertisement -

రిష‌బ్ పంత్‌కు అదృష్టం క‌ల‌సి వ‌చ్చింది. ప్ర‌పంచ క‌ప్ ఆడే జ‌ట్టులో రిష‌బ్‌ను తీసుకోలేద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే శిఖ‌ర్ గాయంకార‌ణంగా టోర్నీ నుంచి వైదొల‌గ‌డంతో పంత్‌కు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం ల‌భించింది. ధావ‌ణ్ గాయ‌నం కార‌నంగా జట్టుకు అందుబాటులో ఉండాలని వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు పిలుపువచ్చింది. వీలైనంత త్వరగా ఇంగ్లండ్‌కు రావాలని, టీమిండియాతో చేరాలని రిషబ్‌కు బీసీసీఐ అధికారులు సూచించారు.

శిఖర్ ధావన్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జట్టు అవసరాల మేరకు తుది జట్టులోకి పంత్‌ను తీసుకోవడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. వరల్డ్ కప్‌కు ఎంపికైన 15 మందితో కూడిన భారత తుది జట్టులో రిషబ్ పంత్‌, అంబటి రాయుడికి చోటు దక్కలేదు. రిషబ్ పంత్, అంబటి రాయుడిని స్టాండ్‌బైలో ఉంచినట్లు బీసీసీఐ సెలక్టర్లు తెలిపారు. అనుభవజ్ఞుడైన అంబటి రాయుడి కంటే ఐపీఎల్, అంతకు ముందు వన్డే సిరీస్‌లలో మంచి ఫాంను చాటుకున్న యువ ఆటగాడు రిషబ్ పంత్‌పైనే బీసీసీఐ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -