ఇగ్లండుకు ప‌య‌న‌మైన టీమిండియా….

390
ICC Cricket World Cup 2019: Team India's PUBG love on full show as Virat Kohli and Co. leave for 2019 World Cup
ICC Cricket World Cup 2019: Team India's PUBG love on full show as Virat Kohli and Co. leave for 2019 World Cup

ఈనెల 30 నుంచి ఇంగ్లండు వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ మ‌హాసంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ‌హాసంగ్రామంలో దాదాపు అన్ని దేశాల జ‌ట్లు ఇంగ్లండు చేరుకుంటున్నాయి. భారీ అంచ‌నాల‌తో బ‌రిలోకి దిగుతున్న టీమిండియా ఇగ్లండుకు ప‌య‌న‌మైంది. కోహ్లీ నేతృత్వంలోని ఆటగాళ్ల టీమ్, ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి

విమానం ఎక్కేందుకు సమయం ఉండటంతో కొంత‌మంది ఆట‌గాళ్లు స‌ర‌దాగా పబ్‌జీ గేమ్‌ను ఆడారు. మహేంద్రసింగ్‌ ధోనీ, చాహల్‌, మ‌హ్మ‌ద్‌ ష‌మీ, భువనేశ్వర్‌ ఇలా ఆటగాళ్లంతా సరదాగా ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఆటగాళ్లందరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. లండన్ కు పయనం కాగా, విమానాశ్రయంలో వీరు దిగిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది.

మెగా టోర్నీ ప్రారంభానికి ముందు భార‌త్ మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ తలపడనుండగా.. మే 28న బంగ్లాదేశ్‌తో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ జట్టు జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది.

Loading...