Thursday, April 25, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ : పంత్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై స్పందించిన కెప్టెన్ విరాట్‌…

- Advertisement -

ఇంగ్లాండ్ లో మే 30 నుంచి క్రికెట్ లో అతిపెద్ద పోటీ ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే అన్ని దేశాల జ‌ట్టు స‌మ‌రానికి సిద్ద‌మ‌వుతున్నాయి. టీమిండియా విషయానికొస్తే ఐపీఎల్ 2019కి ముందే సెలెక్టర్లు భారత జట్టులోని 15 మంది ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. అయితే ఈ జాబితాలో యువ వికెట్ కీప‌ర్ పంత్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై బీసీసీఐపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రెండ‌వ వికెట్ కీపర్‌గా పంత్‌, దినేష్ మ‌ధ్య గ‌ట్టిపోటీనె నెల‌కొంది. చివ‌ర‌కు సెల‌క్ట‌ర్లు డీకేపై మొగ్గు చూపారు.

పంత్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై కెప్టెన్ విరాట్ తాజాగా స్పందించారు. దినేశ్ కార్తీక్ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకుని అత‌న్ని ఎంపిక చేసిన‌ట్లు కోహ్లీ తెలిపాడు. క్లిష్ట‌ప‌రిస్థితుల్లో కార్తీక్ అనుభ‌వం, అత‌ని స‌హ‌నం .. వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉత్త‌మంగా నిలుస్తాయ‌ని కోహ్లీ అన్నారు. ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోనికి ఏద‌యినా అయితే అత‌ని స్థానంలో దినేష్ కార్తిక్ బాధ్య‌త‌లు చేప‌డ్తాడ‌ని కోహ్లీ తెలిపారు.

దినేశ్‌కు అనుభ‌వం ఉంద‌ని, ధోనీకి ఏమైనా అయితే.. అప్పుడు దినేశ్ కీల‌కంగా మారుతాడ‌ని, ఒక ఫినిష‌ర్‌గా దీనేశ్ బాగా ఆడగ‌ల‌డ‌ని కోహ్లీ చెప్పాడు. భారీ టోర్న‌మెంట్‌కు అనుభ‌వం ముఖ్య‌మ‌ని, అందుకే అత‌న్ని ఎంపిక చేశామ‌న్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -