ప్ర‌పంచ రికార్డుకు 37 ప‌రుగుల దూరంలో కోహ్లీ….

231
ICC CWC'19: Virat Kohli 37 runs away from massive World Record
ICC CWC'19: Virat Kohli 37 runs away from massive World Record

ప‌రుగుల మిష‌న్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఆఫ్ సెంచ‌రీలు సాధించారు. తాజ‌గా మ‌రో ప్ర‌పంచ రికార్డును త‌న ఖాతాలో వేసుకొనేందుకు రెడీగా ఉన్నారు.

ప్రపంచ కప్‌ ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని చేరిన కోహ్లి మరో రికార్డుకు సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయంగా టెస్ట్‌, వన్డే, టీ 20ల్లో కలిపి ఇప్పటివరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్‌ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. కోహ్లీ వన్డేల్లో 11087, టెస్టుల్లో 6613, టీ20ల్లో 2263 పరుగులు చేశాడు.

వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లి ఈ రికార్డును చేరుకుంటే, ఈ ఘనతను సాధించిన 12వ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందుతాడు. అంతేగాక భారత్‌ నుంచి మొదటి రెండు స్థానాల్లో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌(34,357), రాహుల్‌ ద్రవిడ్‌ల(24,208) తర్వాత 20వేల పరుగులు సాధించిన మూడో ఆటగానిగా కోహ్లి స్థానం సంపాదించనున్నాడు

అంతర్జాతీయంగా 20వేల పరుగులు సాధించడానికి సచిన్‌, లారాలకు 453 ఇన్నింగ్స్‌లు , రికీ పాంటింగ్‌కు 468 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇప్పటివరకు 416 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి తొందర్లోనే ఈ రికార్డును అధిగమించనున్నాడు

Loading...