Tuesday, April 23, 2024
- Advertisement -

కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబ‌ర్ 1 ర్యాంక్‌కు ఎస‌రు పెట్టిన రోహిత్ …

- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ వ‌రుస సెంచ‌రీల‌తో దూసుకుపోతున్నారు. టీమిండియా వ‌రుస విజ‌యాల‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్ప‌టికే 5 సెంచ‌రీలు చేసిన రోహిత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్ర‌పంచ రికార్డుకు ఎస‌రు పెట్టారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మెగాటోర్నీలో రెచ్చిపోతూ తన కెరీర్లో గుర్తుండిపోయే అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. కేవలం ఎనిమిది మ్యాచుల్లోనే ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో ఏకంగా 647 పరుగులు బాది టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రోహిత్ ఇదే దూకుడు కొన‌సాగిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో టాప్ ర్యాంక్ ర్యాంకును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఐసిసి తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ వన్డే ర్యాకింగ్స్ లో రోహిత్ శర్మ అనూహ్యంగా రెండో స్థానానికి ఎగబాకాడు. అయితే కోహ్లీ 891 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా రోహిత్ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇలా టీమిండియా కెప్టెన్ టాప్ ర్యాంకింగ్ కు వైస్ కెప్టెన్ కేవలం ఆరు పాయింట్ల దూరంలో నిలిచాడు. రోహిత్ ఇదే జోరు కొన‌సాగిస్తే కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక టీమిండియాకు చెందిన జస్ప్రీత్ సింగ్ బుమ్రా వన్డే బౌలర్ల ర్యాకింగ్స్ లో టాప్ లో నిలిచాడు. అతడు ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టడం ద్వారా ఏకంగా 35 పాయింట్లు మెరుగుపర్చుకున్నాడు. దీంతో అతడు 814 పాయింట్లతో ఎవరికీ అందనంత దూరంంలో వున్నాడు. బుమ్రా తర్వాత రెండో స్థానంలో వున్న ట్రెంట్ బౌల్ట్ 758 పాయింట్లతో కొనసాగుతున్నాడు

బ్యాటింగ్‌లో ఐసీసీ టాప్‌ 5 ర్యాంకర్స్‌ వీరే..

విరాట్ కోహ్లి (891)
రోహిత్ శర్మ (885)
బర్ అజామ్ (827)
డుప్లెసిస్ (820)
రాస్ టేలర్ (813)
బౌలింగ్‌లో ఐసీసీ టాప్‌ 5 ర్యాంకర్స్‌ వీరే..

జస్‌ప్రీత్ బుమ్రా (814)
ట్రెంట్‌ బౌల్ట్ (758)
పాట్ కమిన్స్ (698)
కగిసో రబాడ (694)
ఇమ్రాన్ తాహిర్ (683)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -