ఐసీసీ బ్యాటింగ్‌, బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ లో మ‌నోల్లే..

578
ICC ODI Rankings: Kohli and Rohit Stay at Top
ICC ODI Rankings: Kohli and Rohit Stay at Top

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మ‌రోసారి మ‌నోల్లే మెరిశారు. తాజా ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ కోహ్లి నంబర్ వన్‌గా నిలవగా.. 839 పాయింట్లతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.ఐసీసీ ఆదివారం తాజా ర్యాంకింగ్స్ జాబితాలు విడుదల చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ 830 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.బ్యాటింగ్ విభాగం టాప్-10లో వీరిద్దరు మినహా భారత్ నుంచి మరెవరూ స్థానం దక్కించుకోలేకపోయారు.

బౌలింగ్ ర్యాంకింగ్స్ చూస్తే యువ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు ఎదురులేకుండాపోయింది. బుమ్రా 774 పాయింట్లతో వన్డే బౌలర్ల జాబితాలో టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. భారత్ కు చెంది యువస్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరోస్థానంలో ఉండగా, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 8వ స్థానంలో నిలిచాడు. బూమ్రా త‌ర్వాత జిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్, ఆఫ్ఘన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

జట్ల ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా (120 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. 112 పాయింట్లతో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Loading...