Friday, April 26, 2024
- Advertisement -

ప్రపంచ కప్ కు భారత జట్టు రెడీ…. జట్టు ప్రకటన ఎప్పుడంటె….?

- Advertisement -

ఐపీఎల్ పూర్తవగానె ఇంగ్లండు వేదికగా మే 30 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం అవుతుంది. మెగా టోర్నీకి అన్ని దేశాల క్రికెట్ జట్లు సిద్దమవుతున్నాయి. ఇక భారత జట్టు కూడా సిద్దమయ్యింది. ఇప్పటికే జట్టు కూర్పుపై ఒక అంచనాకు వచ్చిన సెలక్టర్లు జట్టు ఎపంకకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే రెండు స్థానాలు మినహా.. జట్టుపై పూర్తి స్పష్టత వచ్చినట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ప్రదర్శన ఆధారంగా రెండు స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈనెల 15న ముంబయిలో సెలక్టర్ల సమావేశం అనంతరం ప్రపంచకప్‌ కోసం 15 మందితో కూడిన జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఓపెనర్లుగా ఇప్పటికే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ పేర్లు ఖాయమవగా.. మూడో ఓపెనర్‌ రేసులో కేఎల్ రాహుల్, అజింక్య రహానె పోటీపడుతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో విరాట్ కోహ్లి ఆడనుండగా.. నాలుగో స్థానం కోసం అంబటి రాయుడు, విజయ్ శంకర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది.

టీమ్‌లో ఒక ఆల్‌రౌండర్ స్థానం కోసం ఇటీవల విజయ్ శంకర్ పోటీనిచ్చినా.. ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో పాటు తన పవర్ హిట్టింగ్‌తో రేసులో ఒక అడుగు ముందు నిలిచాడు. దీంతో మహేంద్రసింగ్ ధోనీ, హార్దిక్ పాండ్య 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో కేదార్ జాదవ్‌ని ఆడిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనలో కూడా సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 15న తర్వాత జట్టు కూర్పుపై ఒక స్పష్టత రానున్న సెలక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -