Thursday, April 25, 2024
- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ మొదలు కాక‌ముందె కాక పుట్టిస్తున్న ఇంగ్లండ్ ఫ్యాన్స్‌

- Advertisement -

త్వ‌ర‌లో ఐపీఎల్ ముగియనున్న నేప‌ధ్యంలో ఇప్పుడు క్రికెట్ అభిమానుల చూపు ప్ర‌పంచ‌క‌ప్‌పై ప‌డింది. ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ఇంకా 20 రోజులు ఉండ‌గానె ఇంగ్లండ్ ఫ్యాన్స్ సెగ‌లు పుట్టిస్తున్నారు. స్లెడ్జింగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటే.. ట్రోలింగ్‌ చేయడంలో మాత్రం ఇంగ్లండ్‌ అభిమానులు ముందుంటారు. ఈ సారి స్వ‌దేశంలో జ‌రుగుతుండ‌టంతో ఇంగ్లండుకు క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువే.

ఇద‌లా ఉంటె ఇంగ్లండ్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో వన్డే వరల్డ్‌కప్ గురించి పోస్టులు, కామెంట్లు పెడుతూ జోరు పెంచుతున్నాయి. ఇంగ్లండ్‌లో మ్యాచులంటే గ్రౌండ్లో సందడి చేసే ఆ దేశ పాపులర్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ క్లబ్‌ ‘బార్మీ ఆర్మీ’.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి జట్లను తమ కామెంట్స్‌తో చికాకుపెడుతూ మానసికంగా దెబ్బతీస్తుంటుంది. టోర్నీ ఆరంభానికి ముందే ఆసీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ… సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది.

క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసిన ‘బాల్ టాంపరింగ్’ వివాదాన్ని ఉద్దేశిస్తూ బార్మ ఆర్మీ పేరుతో ఓ ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. డేవిడ్‌ వార్నర్‌ వేసుకున్న ఆస్ట్రేలియా జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా ‘చీట్స్‌’ అని మార్ఫింగ్‌ చేసిన ‘బార్మీ ఆర్మీ’.. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిన బెన్‌క్రాఫ్ట్‌ను గుర్తు చేస్తూ… కీలక బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌ చేతుల్లో సాండ్‌ పేపర్‌ పట్టుకున్నట్టు ఫొటోలను క్రియేట్‌ చేసి ఫ్యాన్‌ పేజీలో పోస్ట్‌ చేసింది.

లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్న సదరు బార్మీ ఆర్మీ అధికారిక ఖాతాలో ఈ ఫోటో పోస్ట్ కావడంతో ట్విట్టర్‌లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఆసిస్ కోచ్ జసిన్ లాంగర్ కూడా స్పందించాడు. ఇలాంటివి ప‌ట్టించుకోమ‌ని తెలిపాడు. ఇప్పుడే ఇలా ఉంటె ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం అయితే స్లెడ్జింగ్‌, కామెంట్ల‌తో ప్ర‌పంచ క‌ప్ మ‌రింత హీట్ పెంచ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -