Friday, March 29, 2024
- Advertisement -

భార‌త్ అభిమానుల దెబ్బ‌కు దిగి వ‌చ్చిన ఐసీసీ…

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌పై ఉన్న గుర్తు విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. భారత ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదాలో ఉన్న ధోనీ.. పారా మిలటరీకి బలగాలకి చెందిన ‘బలిదాన్’ గుర్తుని తన గ్లోవ్స్‌పై వేయించుకుని ఇటీవల దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కీపింగ్ చేశాడు. అయితే దీనిపై విమ‌ర్శ‌లు రావ‌డంతో వివాదాస్ప‌దంగా మారింది.

దీంతో ధోనీ గ్లోవ్స్ పై పారా మిలిటరీ దళాల స్మారక చిహ్నం ‘బలిదాన్’ ఉండడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ వరల్డ్ కప్ లో మ్యాచ్ లు ఆడుతుండగా, అతడి గ్లోప్స్ పై ఉన్న బలిదాన్ గుర్తు టీవీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఐసీసీ స్పందిస్తూ, రాజకీయ, మతపరమైన గుర్తుల్ని ఆటగాళ్ల జెర్సీలు, కిట్ లపై అంగీకరించబోమని పేర్కొంది.ఈ క్రమంలోనే ధోని గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిందిగా బీసీసీఐకి ఐసీసీ విజ్ఞప్తి కూడా చేసింది. దీనిపై తాజాగా స్పందించిన భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు.. ధోని ధరించిన గ్లౌజ్‌పై ఉన్న లోగోను తొలగించాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేసింది.

అంత‌కుముందు ఐసీసీ నిర్ణ‌యంపై భార‌త్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ధోనికి మద్ద‌తుగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ క్రికెటర్లు ఏకంగా మైదానంలోనే ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు ఈ నిబంధనలు ఏమైపోయాయి? ఈ ఐసీసీ అప్పుడెక్కడికి వెళ్లింది? అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేక ఐసీసీ దిగివ‌చ్చింది.

అది అసలు ఆర్మీకి చెందిన గుర్తు కాదని బీసీసీఐ పరిపాలక కమిటీ(సీఓఏ) పేర్కొంది. ఈ మేరకు సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్ ఈ మేర‌కు స్ప‌ష్టం చేశారు. భారత్‌కి 28 ఏళ్ల తర్వాత 2011‌లో వన్డే ప్రపంచకప్‌ని అందించిన మహేంద్రసింగ్ ధోనీకి భారత ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది. తనకి ఆర్మీ అంటే ఎంతో ఇష్టమని అప్పట్లో చెప్పుకొచ్చిన ధోనీ.. క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఆర్మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -