Friday, March 29, 2024
- Advertisement -

ధోనీ గ్లౌవ్స్‌పై ఉన్న ఆర్మీ చిహ్ననికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ…

- Advertisement -

భారత సీనియర్ క్రికెటర్ ధోనీ తన గ్లౌవ్స్‌పై ఆర్మీ చిహ్నంపై వివాదం కొన‌సాగుతోంది. ఈ విష‌యంలో ఐసీసీ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. అయితే బీసీసీఐకూడా ధోనికి మ‌ద్ద‌తుగా నిలుస్తూ ఎట్టిప‌రిస్థితుల్లోనూ గ్లౌవ్స్‌పై ఆర్మీ చిహ్నం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అది ఆర్మీ గుర్తు కాదని, ఇప్పటికే సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ ఐసీసీకి లేఖ రాశారు. ధోనీ కీపింగ్ గ్లౌవ్స్ ఉన్న గుర్తు ఎలాంటి వాణిజ్య, మతపరమైనది కాదని రాయ్ లేఖలో తెలిపారు. దీనికి మ‌ద్ద‌తుగా భార‌త అభిమానులు కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అవ‌స‌రం అయితే ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి వైదొల‌గాల‌ని, అంతేకాదు ఈ టోర్న‌మెంట్‌ను తిరస్క‌రించాల‌ని సోష‌ల్ మీడియాలో ధోనీకి మ‌ద్ద‌తుగా నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

ఐతే ఐసీసీ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డంలేదు.నిబంధనలకు విరుద్ధంగా ఉండే ఎలాంటి చిహ్నలను అనుమతించేది లేదంటూ ఐసీసీ కరాఖండిగా స్పష్టం చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వికెట్‌ కీపింగ్‌ గ్లోవ్స్‌పై తయారీదారుల లోగో మాత్రమే ఉండాలి… అయితే ఇప్పటికే ధోనీ గ్లోవ్స్‌పై తయారీదారుల లోగో ఉంది. అయితే బలిదాన్ గుర్తు స్పాన్సర్‌షిప్‌ నిబంధనలను అతిక్రమించినట్టవుతుందని ఐసీసీ వాదిస్తోంది.

అమర జవాన్ల స్ఫూర్తిని రగిలించేలా ఉన్న బలిదాన్ గుర్తును దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్‌లో ధోనీ ధరించడం వివాదానికి కారణమైంది. చాహల్ బౌలింగ్‌లో సఫారీ ఆల్‌రౌండర్ ఫెల్కువాయోను స్టంప్ ఔట్ చేసినప్పుడు కెమెరా కండ్లకు ధోనీ గ్లౌవ్స్‌పై చిహ్నం కనిపించింది. దీన్ని పట్టిపట్టి చూపించడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి ఐసీసీ దృష్టికి వచ్చింది. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మ్యాచ్‌లో ధోనీ సదరు చిహ్నంతో ఉన్న గ్లౌవ్స్‌తో బరిలోకి దిగేందుకు అనుమతివ్వాలంటూ ఐసీసీని అభ్యర్థించింది. ధోనీ ధరించిన గ్లౌవ్స్‌పై ఆర్మీకి సంబంధించి ఎలాంటి గుర్తులు లేవని పేర్కొంటూ క్రికెట్ పరిపాలన కమిటీ(సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్..ఐసీసీని కోరడం జరిగింది.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ధోనీ ధరించిన గ్లోవ్స్‌పై కంపెనీ లోగోతో పాటు చిహ్నం కనిపించింది. ఇలాంటి గ్లౌవ్స్ మెగాటోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లో ధరించేందుకు ధోనీకి అనుమతి ఇవ్వడం లేదు అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలా ఉంటె ధోనీ విషయంలో ఐసీసీ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న అభిమానులు..బలిదాన్ గుర్తుతో ఆడాల్సిందేనంటూ సోషల్‌మీడియాలో ప్రాచరానికి తెరలేపారు. #dhonikeep the glove అనే యాష్ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. దేశభక్తిని చాటుకున్న ధోనీకి పలువురు మాజీ క్రికెటర్లతో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు మద్దతుగా నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -