పాక్‌ అభినంద‌న్ యాడ్‌కు దిమ్మదిరిగే కౌంట‌ర్ ఇచ్చిన పూన‌మ్ పాండే…

337
ICC World Cup 2019, IND vs PAK : Poonam Pandey Trolled For Response to Pakistani Promo ad Featuring Abhinandan
ICC World Cup 2019, IND vs PAK : Poonam Pandey Trolled For Response to Pakistani Promo ad Featuring Abhinandan

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కి ముందే కవ్వింపులు తారాస్థాయికి చేరాయి. పాక్ మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి దిగ‌జారి పబ్లిసిటీకి తెరలేపిన విషయం తెలిసిందే. పాక్‌, భార‌త్ మ్యాచ్ అంటె ఉత్కంఠ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది. దానికి తోడు ఇరు దేశాల అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్వీట్‌ల‌తో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు.

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16 భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఓ పాకిస్థాన్ టీవీ చానల్ చేసిన యాడ్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ వీడియోపై భార‌తీయుల్లో ఆగ్ర‌హ‌వేశాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా యాడ్ ఫిల్మ్‌లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను హేళన చేస్తూ చూపించడమే భారతీయలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 30 సెకన్లపాటు నిడివి ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ రూపొందించింది.

ఈయితే ఈ యాడ్‌పై పూన‌మ్ పాండె ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. యాడ్‌లో ఉన్నట్లు టీ కప్‌ను అభినందన్ పాత్రధారి చేతిలోంచి లాక్కున్నట్లు చూపించిందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కప్ కావాలంటే అదే కప్ ఎందుకు ఈ ‘డీ’ కప్ తీసుకోండి. మీకు కావాల్సింది ఇదే అంటూ తాను ధరించిన బ్రా ను తీసి, ఇందులో రెండు కప్‌లు ఉన్నాయంటూ హాట్ రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎంతైనా పూన‌మ్ పాండే స్టైలే వేరు క‌దా.

Loading...