Friday, April 19, 2024
- Advertisement -

వరల్డ్‌కప్ భారత జట్టు ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ సెలక్టర్..

- Advertisement -

ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండులో జరిగే మెగా టోర్నీ ప్రపంచకప్ కు సిద్దమవుతోంది. బీసీసీఐ ఇప్పటికే జట్టు కూర్పుపై ఒక అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 15న భారత జట్టును ప్రకటించనున్నారు సెలక్టర్లు. జట్టు కూర్పుపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఐపీఎల్ ద్వారా మెరుగైన ప్రదర్శన చేసి జట్టుకు ఎంపిక అవుదామనుకున్న యువ క్రికెటర్లకు షాక్ ఇచ్చారు. అసలు ఐపీఎల్ ప్రదర్శనతో వరల్డ్‌కప్ టీమ్ ఎంపికకు సంబంధమే లేదంటూ బాంబు పేల్చారుడు.

టీమ్ ఎంపిక సమయానికి ఐపీఎల్ ప్రారంభమై మూడు వారాలు కానుంది. దీంతో లీగ్‌లో ప్లేయర్స్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారన్న వార్తలు మొదటి నుంచీ వచ్చాయి. అయితే ఎమ్మెస్కే మాత్రం ఆ వాదనలకు చెక్ పెట్టాడు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ ల అభిప్రాయాన్నే ఎమ్మెస్కే వ్యక్తం చేశాడు. టీమ్ ఎంపికపై ఇప్పటికే మాకు స్పష్టత వచ్చింది అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు. టీమ్‌లో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌పై సందిగ్ధత ఉన్న సంగతి తెలిసిందే. ధీన్ని బట్టి చూస్తె ఇప్పటికే జట్టు కూర్పుపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -