టీమిండియాపై సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేసిన స‌చిన్‌..

438
ICC World Cup 2019 : Sachin tendulkar intersting comments on Team india
ICC World Cup 2019 : Sachin tendulkar intersting comments on Team india

మరి కొన్నిరోజుల్లో ఇంగ్లండులో ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా బ్రిటీస్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. ఇండియా కూడా ఫేవరేట్ టీమ్ గానె బ‌రిలోకి దిగుతోంది. భార‌త్ గెలుపుపై క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క కోహ్లీమీద‌నె ఆధార‌ప‌డితే క‌ప్పు గెల‌వ‌లేమ‌ని….జ‌ట్టులోని సహ‌చ‌రులంతా క‌ల‌సి క‌ట్టుగా ఆడితేనె క‌ప్పు గెలిచే అవ‌కాశాలు మెండుగా ఉంటాయ‌న్నారు.

ప్రతి గేమ్ లోనూ ఎవరో ఇద్దరు ఆటగాళ్లు రాణించినా టీమ్ సపోర్ట్ లేనిదే టోర్నీలో విజయం సాధించలేరని, ప్రపంచకప్ లో కీలకదశలో జట్టుగా రాణించినప్పుడే విజయాలు సాధ్యమని అన్నారు. సమష్టి ప్రదర్శన లేకపోతే నిరాశ తప్పదని సచిన్ హెచ్చరించారు.

కీలకసమయాల్లో తలో చెయ్యి వేసి ప్రత్యర్థిని ఓడించాలి. ఏ జట్టుకైనా సరే సమన్వయం కోల్పోతే నిరాశ తప్పదు. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానం గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. అది నాదృష్టిలో స‌మ‌స్మే కాద‌ని అది నంబ‌ర్ మాత్ర‌మేన‌ని త‌న అభిప్రాయాన్ని తెలియ‌జేశారు.

నాలుగో నంబర్ లో ఎవరు బ్యాటింగ్ చేయాలన్నది ఓ సమస్యగా తాను భావించడంలేదని, టీమిండియాకు బ్యాట్స్ మెన్ కొదలేరని, ఎవరైనా ఆ స్థానంలో కుదురుకోవచ్చని అన్నారు. 4, 6, 8 ఇలా ఏ స్థానం అయినా పరిస్థితికి తగ్గట్టుగా ఆడడమే కీలకమని వివరించారు.

Loading...