Friday, March 29, 2024
- Advertisement -

కొత్త అవ‌తారం ఎత్తిన స‌చిన్ ….ఫ్యాన్స్‌కు పండ‌గే

- Advertisement -

సచిన్ టెండూల్కర్ బ్యాటు పట్టి మైదానంలోకి దిగితే దశాబ్దాల రికార్డులు బద్దలు అవుతాయి. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు న‌మోదు చేసిన స‌చిన్ రెండో ఇన్నీంగ్స్‌ను మొద‌లు పెట్టారు. సునీల్ గవాస్కర్, కుంబ్లే, గంగూలీ, లక్ష్మణ్.. మాదిరిగా సచిన్‌ కూడా మైక్ పట్టేశాడు. నిన్న జ‌రిగిన ఇంగ్లండు, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంట్రీ బాక్స్‌లో సచిన్ సందడి చేశాడు.

2013లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ, ఐసీసీ అభ్యర్థించినా.. కామెంట్రీకి నో చెప్తూ వస్తున్న సచిన్.. ఎట్టకేలకి కామెంటేటర్‌గా వరల్డ్‌కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ముందు స్టార్‌ స్పోర్ట్స్‌ చర్చా కార్యక్రమంలోనూ సచిన్‌ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి ‘సచిన్‌ ఓపెన్స్‌ అగేన్‌’ అని పేరు పెట్టిందా ఛానెల్‌.

సుదీర్ఘ‌కాలం భార‌త జ‌ట్టు త‌రుపున ఆడిన స‌చిన్ ఆరు ప్ర‌పంచ‌క‌ప్ ఆడారు. 2003 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేసిన సచిన్.. మొత్తంగా ఆరు ప్రపంచకప్‌ల్లో కలిపి 2,278 పరుగులు చేశాడు. ఇప్పటికీ.. వరల్డ్‌కప్‌లో ఈ రికార్డ్‌ని ఎవరూ బ్రేక్ చేయలేదు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 104 ప‌రుగుల భారీ తేడాతో స‌ఫారీల‌పై మొద‌టి విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -