Saturday, April 20, 2024
- Advertisement -

రోహితేమి నాభార్య కాదు…. శిఖ‌ర్ ధావ‌న్‌

- Advertisement -

ఐపీఎల్ పొట్టి ప్రికెట్ ఫార్మెట్ ముగియ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ క‌ప్‌కు సిద్ద‌మ‌వుతున్నారు టీమిండియా ఆట‌గాళ్లు.పొట్టి క్రికెట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌కు అలవాటు పడేందుకు క్రికెటర్లకు కాస్త టైమ్ పడుతుంది. అయితే టీ20 నుంచి 50 ఓవర్ల ఫార్మాట్‌కు మార‌డానికి పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌నిలేద‌ని ఢిల్లీ క్యాపెట‌ల్, టీమిండియా ఓపెన‌ర్ గ‌బ్బ‌ర్ అభిప్రాయ ప‌డ్డారు. తాజా ఐపీఎల్‌లో రాణించిన బ్యాట్స్‌మెన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్, టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ 16 మ్యాచ్‌లాడి 521 పరుగులు సాధించి ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఢిల్లీ తరఫున పృథ్వీ షాతో ఓపెనింగ్ చేసిన తనకు టీమిండియాలో రోహిత్ శర్మతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించడం ఇబ్బంది ఉండ‌ద‌న్నాడు. తరచుగా రోహిత్‌తో టచ్‌లో ఉంటారా అని అడిగిన ప్రశ్నకు.. ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి రోహిత్ తనకేమీ భార్య కాదంటూ చమత్కరించాడు ‘గబ్బర్’. ఏ జట్టు విజయాలలో అయినా టాపార్డర్ ఆటగాళ్ల పరుగులు, ఫామ్ కీలకమని పేర్కొన్నాడు.

చాలా ఏళ్లుగా రోహిత్‌తో కలిసి ఆడుతున్నా. ఇప్పుడు ప్రత్యేకంగా రోహిత్ నా గురించి, నేను అతడి గురించి తెలుసుకోవాల్సిన పనిలేదు. ఓపెనింగ్ అనేది ఇద్ద‌రి మైండ్ సెట్‌మీద ఆదార‌ప‌డి ఉంటుంద‌న్నారు. ఒకరు పరుగులు సాధిస్తున్నప్పుడు అవతలి బాట్స్‌మన్ స్ట్రైక్ రొటేస్ట్ చేస్తూ సహకరించాలి. మైండ్ సెట్ మార్చుకుంటే ఐసీసీ లాంటి కీలక టోర్నీల్లోనూ సులువుగా పరుగులు చేయవచ్చు. ప్ర‌పంచ క‌ప్‌లో ఒత్తిడి లేకుండా ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఈ సంద‌ర్భంగా గ‌బ్బ‌ర్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -