Friday, April 19, 2024
- Advertisement -

ధోని కె నాయకత్వంలో టీమిండియా కాలర్ ఎగరేసిన రోజు…

- Advertisement -

ధోని నాయకత్వంలోని టీమిండియా పాకిస్థాన్ జట్టుపై గెలిచి టీ20 ప్రపంచకప్ ను గెలిచి నేటికి 12 ఏళ్లు అవతున్న సందర్భంగా ఆ మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ మొదటి టీ-20 వరల్డ్‌కప్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇండియా కప్‌నే గెలుచుకొని సంచలనం సృష్టించింది.

ఈ మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడింది కేవలం ఒకే ఒక్క టీ20 మ్యాచ్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లను కాదని భారత్ ఫైనల్ కు వచ్చింది మాత్రం పాక్, ఇండియా.చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాక్ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 5 వికెట్లు కోల్పోయి, 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 75 పరుగులు చేశాడు.

158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా మాత్రం వీరోచితంగా ఆడుతూ పాక్ విజయంపై ఆశలు చిగురించేలా చేశాడు.ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ అతడు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకువచ్చాడు. చివరి ఓవర్‌లో పాక్ 13 పరుగులు చేయాలి. ఇదే సమయంలో కెప్టెన్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఏమాత్రం అనుభవంలేని జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. మొదటి బంతికే సిక్సర్ బాదిన మిస్బా మరుసటి బంతికి స్కూప్ ఆడబోయి, షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ శ్రీశాంత్‌కు చిక్కాడు. దీంతో టీమిండియా 5 వికెట్లతేడాతో గెలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -