స్లెడ్జింగ్‌కు దిగిన కోహ్లీ.. మళ్లీ నోరు జారలేదు : బంగ్లాదేశ్ క్రికెటర్

535
imrul kayes recalls how he countered virat kohli’s sledge
imrul kayes recalls how he countered virat kohli’s sledge

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడన్న విషయం తెలిసిందే. తనపై నోరు లేపితే ఎంతటి ఆటగాడికైన బదిలివ్వకుండా వెనకడుగు వేయడు. అయితే 2011 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కవ్వింపులకి దిగినట్లు తాజాగా ఆ దేశ క్రికెటర్ ఇమ్రూల్ ఖైస్ గుర్తు చేసుకున్నాడు. 2011లో కోహ్లీ తనపై స్లెడ్జింగ్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయ్యానని ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ఈ విషయాన్ని తమ సీనియర్ ప్లేయర్లకు చెప్పడంతో వారు కోహ్లీకి సరైన రీతిలో బదిలివ్వడంతో అప్పటి నుంచి కోహ్లీ తన జోలికి రాలేదన్నాడు. క్రిక్ ఫ్రెంజీ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. “కోహ్లీ నేను 2007లో ఆస్ట్రేలియాలో ఓ క్యాంప్‌కి హాజరయ్యాము. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అయితే 2011లో కోహ్లీ నాపై స్లెడ్జింగ్ చేయడం ఆశ్చర్యపరిచింది.

నేను అతనికి ఏం బదిలివ్వకుండా ఈ విషయంను తమీమ్ ఇక్బాల్‌కి చెప్పాను. దాంతో తమీమ్ గ్రౌండ్‌లో కోహ్లీపై స్లెడ్జింగ్‌‌కు దిగాడు. దాంతో కోహ్లీ అప్పటి నుంచి నాపై స్లెడ్జింగ్‌కి చేయలేదు.’ అని ఇమ్రూల్ ఖైస్ వెల్లడించాడు. ఇక గతేడాది జరిగిన టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ తమ ఆటగాళ్లందరిని కవ్వించాడని.. కానీ తనని మాత్రం ఏం అనలేదని ఇమ్రూల్ ఖైస్ చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ జట్టులో ఉన్న సమయంలోనే భారత్‌తో ఇమ్రూల్‌ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Loading...