Saturday, April 20, 2024
- Advertisement -

స‌చిన్‌, లారా రికార్డ్‌ల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌నున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ…

- Advertisement -

ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల‌లో మూడిట్లో గెల‌వ‌గా న్యూజిలాండ్‌తో వార్షం కార‌నంగా మ్యాచ్ ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌న‌దైన శైలిలో ఆడుతూ విజ‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. రేపు టీమిండియా ఆప్ఘ‌న్‌తో ఆడ‌నుంది.

ఎందుకంటే విరాట్ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే ప్రపంచ క్రికెట్ లో ఇద్దరు దిగ్గజాల రికార్డును బద్దలు కొట్టినవాడవుతాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 20,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు.భారత కెప్టెన్ కోహ్లీ అత్యంత వేగంగా 20,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయి చేరుకోడానికి ఇంకా 104 పరుగుల దూరంలో ఉన్నాడు. రేపు ఆప్ఘ‌న్ మ్యాచ్‌లో 104 ప‌రుగులు చేస్తె మ‌రో రికార్డు కోహ్లీ సొంత‌మ‌వుతుంది.

అంత‌ర్జాతీయంగా విరాట్ కోహ్లీ కేవలం 415 ఇన్నింగ్స్ లో 131 టెస్టులు, 222 వన్డేలు, 62 టీ-20 మ్యాచ్ ల్లో 19,896 పరుగులు చేశాడు. దీంతో అతను క్రికెట్ ప్రపంచంలో ఇద్దరు అగ్రశ్రేణి దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ కి చెందిన బ్రయాన్ లారాల సంయుక్త రికార్డును చెరిపేయనున్నాడు. లారా, సచిన్ లకు 20,000 అంతర్జాతీయ పరుగులు చేసేందుకు 453 ఇన్నింగ్స్ పట్టాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయి చేరుకున్నాడు.

ప్రపంచ కప్ 2019లో కోహ్లీ సచిన్ టెండూల్కర్ అత్యంత వేగంగా 11,000 వన్డే పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డును పాక్ మ్యాచ్ లో అతను సాధించాడు. భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్ లు గెలవగా న్యూజిలాండ్ తో మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఒక పాయింట్ వచ్చిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -