Tuesday, April 16, 2024
- Advertisement -

మొద‌టి టెస్ట్‌లో ఆధిక్యం దిశ‌గా భార‌త్‌…ఆట నాలుగో రోజె కీల‌కం

- Advertisement -

ఆడిలైడ్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ప‌ట్టు బిగిస్తోంది. భారీ ఆధిక్యం దిశ‌గా సాగుతోంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో లాగే సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుసగా విఫలమవుతూ వస్తున్న కెఎల్ రాహుల్… 44 పరుగులు చేయగా… మురళీ విజయ్ 18 పరుగులకు అవుట్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆటతీరుకు భిన్నంగా జిడ్డాట ఆడాడు. 104 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లీ… 34 పరుగులు చేసి నాథన్ లియోన్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151/3తో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకోవడంతో భారత్‌ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 150 పరుగులు చేస్తే.. అడిలైడ్ టెస్టుపై భారత్ పట్టు బిగించే అవకాశం ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే ఔటైన కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడిన రాహుల్ 67 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దీంతో భారత్ తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించింది. మురళీ విజయ్ (18) మరోసారి నిరాశపరిచాడు.

ఈ దశలో ఛటేశ్వర్ పుజారా (127 బంతుల్లో 40 బ్యాటింగ్ ), విరాట్ కోహ్లి (104 బంతుల్లో 34) భారత్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. నెమ్మదిగా ఆడుతూ.. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. మరికాసేపట్లో మూడో రోజు ఆట ముగుస్తుందనగా.. లియాన్ బౌలింగ్‌లో కోహ్లి అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పుజారాతోపాటు రహానే (1) క్రీజులో ఉన్నాడు.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుకు 15 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. 167 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ 6 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు వికెట్లు దక్కగా… ఇషాంత్, షమీలకు చెరో రెండేసి వికెట్లు దక్కాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -