Thursday, April 25, 2024
- Advertisement -

హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగుతున్న టీమిండియా ఓపెన‌ర్లు..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా బంగ్లాతో జ‌ర‌గుతున్న మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్లు చెల‌రేగిపోతున్నారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన భారీ స్కోరు దిశ‌గా వెల్తోంది. ఓపెనింగ్ ద్వయం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూకుడు, నిలకడ సమ్మిళితంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.

రోహిత్ శర్మ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేశాడు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఓవర్లు గడిచేకొద్దీ బాదుడు షురూ చేశాడు. రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తుండడంతో రాహుల్ పై భారం తగ్గింది. దాంతో రాహుల్ కూడా జోరు పెంచారు.20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 124 ప‌రుగులు చేసింది. రోహిత్ 63, రాహుల్ 57 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

టీమిండియా తుది జట్టులో కోహ్లీ రెండు మార్పులు చేశాడు. ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో పేలవంగా విఫలమైన కేదార్ జాదవ్‌పై వేటు వేసి దినేశ్ కార్తీక్‌కి అవకాశమిచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని తప్పించి.. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -