Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీకోసం మ‌రో ప్ర‌పంచ రికార్డ్ ఎదురు చూస్తోంది..

- Advertisement -

ప‌రుగుల మిష‌న్ విరాట్ కోహ్లీకోసం మ‌రో ప్ర‌పంచ రికార్డ్ ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ.. వన్డేల్లో 11 వేల మార్కుకు కేవలం 57 పరుగుల దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో మరో 57 పరుగులు చేస్తే 11 వేల మార్కును చేరుకుంటాడు. ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌లో10943 పరుగులు పూర్తిచేసిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు కూడా గడవకముందే ఈ మైలురాయిని చేరుకొని రికార్డు సృష్టించనున్నాడు.

ఇప్పటి వరకు వన్డేల్లో 11 వేల పరుగులను ఎనిమిది మంది ఆటగాళ్లు పూర్తి చేశారు. కోహ్లీ ఈ ఫీట్‌ సాధిస్తే 9వ స్థానంలో నిలుస్తాడు. ఇక.. భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీలు 11వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు. కాగా ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ చెలరేగితే దాదా అత్యధిక పరుగుల (11363) రికార్డును అధిగమించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ రోజు న్యూజిలాండ్‌పై శతకం సాధిస్తే మాత్రం వీరేందర్‌ సెహ్వాగ్‌, రికీపాంటింగ్‌లతో సమానంగా ఆ జట్టుపై ఆరు శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -