Wednesday, April 24, 2024
- Advertisement -

పాక్ ఓట‌మిపై స్పందించి కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్‌…

- Advertisement -

ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన బిగ్‌ఫైట్‌లో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. భారత్ 89 (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) పరుగులతో పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించింది. తొలుత హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ (113 బంతుల్లో 140; 14ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 77, 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోరు చేసింది. పాక్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ రాహుల్, రోహిత్ నిర్మించిన పటిష్ఠమైన ఇన్నింగ్స్‌ను కోహ్లీ మరోస్థాయికి తీసుకెళ్లాడు. హిట్‌మ్యాన్ పేరుకు సార్ధకతను చేకూరుస్తూ రోహిత్ కొట్టిన కొట్టుడుకు మాంచెస్టర్ మైదానం దద్దరిల్లిపోయింది. లక్ష్యఛేదనలో శంకర్ (2/22), హార్దిక్ (2/40), కుల్దీప్ యాదవ్ (2/32) ధాటికి పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులకు పరిమితమైంది.

అయితే ఓట‌మిపై పాక్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ స్పందించారు. కీల‌క స‌మ‌యంలో వ‌రుస‌గా నాలుగు వికెట్లు కోల్పోవ‌డ‌మే మా కొంప ముంచింద‌న్నారు. టాస్ ను గెలిచి కూడా ఆ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని అభిప్రాయపడ్డాడు

మ్యాచ్‌ లో క్రెడిట్‌ భారత బ్యాట్స్‌ మెన్‌ దేనని అన్నాడు. తమ బౌలర్లు సరిగ్గా బౌలింగ్‌ చేయలేదని, తాను అద్భుతమైన ఆటగాడినని రోహిత్ శర్మ మరోసారి నిరూపించుకున్నాడని అన్నాడు. రోహిత్‌ ను సాధ్యమైనంత త్వరగా అవుట్ చేయాలని ప్రణాళికలు రూపొందించినా, అవి పనిచేయలేదని చెప్పాడు. బ్యాటింగ్‌ తో పాటు బౌలింగ్‌ లోనూ ఇండియా సమష్టిగా రాణించిందని పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -