Thursday, April 25, 2024
- Advertisement -

భారత్ కు బ్రేక్ ఇచ్చిన ఇషాంత్….పట్టుబిగిస్తున్న కోహ్లీసేన

- Advertisement -

విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది.ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా.. బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 39/3తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన దక్షిణాఫ్రికా టీమ్ తొలి సెషన్ ఆరంభంలోనే 63 పరుగుల వద్ద బవుమా రూపంలో నాలుగో వికెట్ చేజార్చుకుంది.

భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా, ఇషాంత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగించిన విషయం తెలిసిందే.ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫ్రంట్‌ ఫుట్‌పైకి వచ్చి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన తెంబ బవుమా (18: 26 బంతుల్లో 3×4) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆఫ్ స్టంప్‌ లైన్‌ పడిన బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు.

ఓపెనర్ డీన్ ఎల్గర్ 144 బంతుల్లో 55 స్కోరుతో అర్థశతకం సాధించారు. కెప్టెన్ డుప్లెసెస్ (30) తో కలసి ఎల్గర్ దూకుడుగా ఆడుతున్నారు. వీరిద్దరూ 84 బంతుల్లో 55 స్కోరు భాగస్వామ్యం నెలకొల్పారు.40 ఓవర్లు పూర్తయ్యే సరికి సఫారీలు 114 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి ఆట కొనసాగిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -