ఆఫ్ సెంచరీతో మరో సారి మెరిసిన రోహిత్…రెండు రికార్డ్స్ బ్రేక్

1725
IND vs SA 1st Test : Hitman Rohit sharma brings up his 11th test 50
IND vs SA 1st Test : Hitman Rohit sharma brings up his 11th test 50

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పరుగుల వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నీంగ్స్ లో భారీ సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. 72 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.టెస్టుల్లో అతనికిది 11వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. సూపర్‌ఫామ్‌లో ఉన్న రోహిత్‌ మరో సెంచరీ బాదాలనే కసితో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మయాంక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తరుణంలో రోహిత్‌తో కలిసి చతేశ్వర పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలోనె హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 30 ఓవర్లు ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ వికెట్‌ నష్టానికి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌(50), ఛెతేశ్వర్‌ పుజారా(24) క్రీజులో ఉన్నారు. కోహ్లీసేన 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

సొంతగడ్డపై గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో హిట్‌మ్యాన్‌ 82, 51, 102, 65, 50, 176, 50 (ప్రస్తుతం) ఏడుసార్లు 50కిపైగా స్కోరు సాధించి అరుదైన ఘనత సాధించాడు. భారత్‌ తరఫున మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

Loading...