Thursday, April 25, 2024
- Advertisement -

మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా…..

- Advertisement -

విశాఖలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ మొదటి వికెట్ ను కోల్పోయింది. కేశవ్ మహరాజ్ బౌలింగ్ క్సర్, ఫోర్ బాదిన రోహిత్ శర్మ (176 బంతుల్లో23 ఫోర్లు,6 సిక్సర్లు)తరువాత బంతికే పెవిలియన్ చేరాడు.ఫ్రంట్ ఫూట్ లో బారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన రోహిత్ ను వికెట్ కీపర్ డికాక్ స్టంప్ అవుట్ చేశారు. టీమిండియా 3 17 పరుగుల వద్ద తన మొదటి వికెట్ ను కోల్పోయింది. లంచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 324 పరుగులు చేసింది.క్రీజులో మయాంక్ అగర్వాల్ 138, పుజారా 6 పరుగులతోను ఆడుుతన్నారు.సఫారీలపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డు నమోదు చేశారు.

ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్‌ వేసిన 82 ఓవర్‌ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌ స్టంపింగ్‌ అయ్యాడు. అయితే భారత్‌ తొలి వికెట్‌కు కోల్పోయే సరికి భారత ఓపెనర్లు కొట్టిన సిక్సర్లు 9. దాంతో టెస్టు ఫార్మాట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత జోడిగా వీరిద్దరూ ఘనత సాధించారు.

ఓవర్‌నైట్ స్కోరు 202/0‌తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ జోడీ.. తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడింది.వరుస బౌండరీలు బాదిన మయాంక్ అగర్వాల్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేయగా.. రోహిత్ శర్మ 150 పరుగుల మైలురాయిని అందుకుని డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -