టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన జడేజా…

1593
IND vs SA 1st Test : Ravindra Jadeja fastest left-arm bowler to 200 Test wickets
IND vs SA 1st Test : Ravindra Jadeja fastest left-arm bowler to 200 Test wickets

టీమిండియా ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల వికెట్ల మార్కును చేరిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సఫారీలతో విశాఖలో జరుగుతున్న టెస్ట్ లో ఎల్గర్ ను ఔట్ చేయడం ద్వారా 200 వికెట్ల మైలురాయిని అందుకున్నారు.

ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా.. డానీ పీడ్త్‌, ఎల్గర్‌ వికెట్లను సాధించి ‘డబుల్‌ సెంచరీ’ కొట్టేశాడు. కాగా, ఇది జడేజా 44వ టెస్టు. ఫలితంగా అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లను సాధించిన లెఫ్టార్మ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇదే సందర్భంలో శ్రీలకం ఆటగాడు హెరాత్ రికార్డును దాటేశాడు.అంతకముందు హెరాత్‌ రెండొందల టెస్టు వికెట్లు సాధించడానిక 47 టెస్టులు ఆడగా, ఇంకా మూడు టెస్టులు ముందుగా జడేజా దాన్ని అందుకున్నాడు.

Loading...