మొదటి ఇన్నీంగ్స్ లో ముగిసిన సఫారీల జోరు….. భారత్ ఆధిక్యం 71

1690
IND vs SA 1st Test : South Africa all out for 431 runs
IND vs SA 1st Test : South Africa all out for 431 runs

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాని తొలి ఇన్నీంగ్స్ పోరు ముగిసింది. 431 పరుగలుకు సఫారీలను టీమిండియా ఆలౌట్ చేసింది. దీంతో భారత్ కు 71 పరుగుల ఆధిక్యం సంపాదించింది.ఆటలో నాలుగో రోజైన శనివారం 385/8తో మొదటి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన సఫారీలు తొలి సెషన్‌లోనే 431 వద్ద కుప్పకూలిపోయారు. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌ని 502/7తో డిక్లేర్ చేసి ఉన్న భారత్ జట్టుకి 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. సఫారీ జట్టులో డీన్ ఎల్గర్ (160: 287 బంతుల్లో 18×4, 4×6), డికాక్ (111: 163 బంతుల్లో 16×4, 2×6) శతకాలు సాధించగా.. టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఏడు, జడేజా రెండు, ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టారు.

ఓవర్‌నైట్‌ ఆటగాడు కేశవ్‌ మహరాజ్‌(9;31 బంతుల్లో 1ఫోర్‌) తన వంతు పోరాటం చేసి తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా, మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు ముత్తుస్వామి మాత్రం భారత బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించాడు. 106 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Loading...