ఎల్గర్, డీకాక్ సెంచరీలు చేసినా ఆటను మలుపు తిప్పిన అశ్విన్….

1687
IND vs SA 1st Test : South Africa trail India by 117 runs at stumps
IND vs SA 1st Test : South Africa trail India by 117 runs at stumps

విశాఖలో జరుగుతున్న మొదటి టెస్టులో సఫారీలను కష్టాలు వెంటాడుతున్నాయి.భారత్ సాధించిన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా ఆ జట్టు 117 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి.39/3 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన సఫారీలు ఆట చివరికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేశారు.

ఓపెనర్ డీన్ ఎల్గార్ (160), వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ (111) ల సెంచరీలతో దక్షిణాఫ్రికా భారీస్కోరు దిశగా వెల్తున్న జట్టుకు అశ్విన్ బ్రేక్ లు వేశారు. అశ్విన్ మ్యాజిక్ చేయడంతో వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.అశ్విన్ కు 5 వికెట్లు దక్కాయి. ఇవాళ్టి ఆటలో డుప్లెసిస్ (55), డికాక్ లను అవుట్ చేయడంతోపాటు, ఆల్ రౌండర్ ఫిలాండర్ ను కూడా అశ్విన్ డకౌట్ చేశాడు.భారత్ తొలి ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 502 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.

Loading...